డ్యూటీలో మాత్రమే కుర్చీ.. ఇంటికి వెళ్తే మళ్లీ నేలే!

రాజస్థాన్‌లోని బాన్స్‌వారా జిల్లా గ్రామాల్లో మగవారు ఉన్న చోట మహిళలు కుర్చీ లేదా మంచంపై కూర్చోకూడదనే కట్టుబాటు ఇంకా ఉంది. ఎంత వయసొచ్చినా, ఆరోగ్య సమస్యలున్నా వీరు నేలపైనే కూర్చోవాలి. అయితే ఉపాధి హామీ పథకం ద్వారా సూపర్‌వైజర్లుగా మారిన మహిళలకు ప్రభుత్వం వర్క్ ప్లేస్‌లో అటెండెన్స్, రికార్డుల కోసం ఒక ప్లాస్టిక్ కుర్చీ కేటాయించింది. పని చేసే కొద్ది గంటలు వారు కుర్చీలో కూర్చుని పురుషులతో సమానంగా స్వేచ్ఛను అనుభవిస్తున్నా, సాయంత్రం ఇంటికి వెళ్లగానే మళ్లీ పాత పద్ధతిలోనే నేలపైనే కూర్చోవాల్సి వస్తోంది.



