అధికారుల రాక.. హాట్ టాపిక్‌గా మారిన షాపుల తొలగింపు ప్రక్రియ
గుంటూరు జిల్లా రాజధాని ప్రాంతంలోని దొండపాడు సెంటర్‌లో ఆర్‌అండ్‌బీ రహదారి పక్కన ఉన్న దుకాణాలను తొలగించేందుకు సీఆర్‌డీఏ, పంచాయతీ అధికారులు, పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. త్వరలో దుకాణాల తొలగింపునకు చర్యలు చేపడతామన్న అధికారులు, దొండపాడు సెంటర్‌లో వివిధ శాఖల అధికారులు ఒకేసారి రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దుకాణాల తొలగింపు ఎప్పుడు చేపడతారు, తదుపరి చర్యలేంటి అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.

