వాజ్‌పేయికి గొడుగు పట్టిన ఇందిరాగాంధీ

ఈ ఫొటో వెనుక ఉన్న చరిత్రేమిటో తెలుసా? 1972 జూలైలో భారత్-పాకిస్తాన్ మధ్య సిమ్లా ఒప్పందం జరిగింది. ఇందిరా గాంధీ, జుల్ఫికర్ అలీ భుట్టో సంతకాలు చేశారు. అప్పటి జనసంఘ్ ప్రముఖ నాయకుడు అటల్ బిహారీ వాజ్‌పేయి సిమ్లాకు వెళ్లి తన వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఇందిరాగాంధీ వాజ్‌పేయిని ఆహ్వానించి లాన్‌లో ఆయనతో మాట్లాడారు. ఆ టైంలో వాన మొదలైంది. అధికారి ఒకరు ప్రధానమంత్రికి గొడుగు ఇవ్వగా, ఇందిరాగాంధీ ఆ గొడుగు వాజపేయి తలపై పట్టారు. వారిద్దరూ అలాగే మాట్లాడుకున్నారు.


