← Back to news

కాంగ్రెస్ నాయకుడు, ఆయన కుమారుడి హత్య

By Vishi· 16 Aug 2026· Ndtv· West Bengal
కాంగ్రెస్ నాయకుడు, ఆయన కుమారుడి హత్య

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం నాడియా జిల్లాలో కాంగ్రెస్ నాయకుడు అనీసూర్ రెహ్మాన్(50), ఆయన కొడుకు అబూ సుఫియాన్ (24)ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. అనీసూర్ రెహ్మాన్ బెంగాల్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడు. నాడియా జిల్లా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ. ఆయన నకషిపారా ప్రాంతంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు. బెతువాదహారి నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా నగడి రైల్వే గేట్ దగ్గర కారు మీద కాల్పులు జరిపారు. తర్వాత పదునైన ఆయుధాలతో దాడి చేశారు. ఇద్దరూ అక్కడికక్కడే మరణించినట్లు స్థానికులు చెబుతున్నారు.

More in Current Affairs