ఘోర ప్రమాదం.. స్కూటీపై వెళ్తున్న యువతి 😭

హైదరాబాద్ఛ గచ్చిబౌలి ప్రాంతంలో వాటర్ ట్యాంకర్ ఢీకొని యాక్టివాపై వెళ్తున్న యువతి అక్కడికక్కడే మృతి చెందింది. యువతి తల, ఇతర శరీర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలు దగ్గర్లో ఉన్న హాస్టల్లో ఉంటూ ప్రైవేటు జాబ్ చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ప్రమాదం తర్వాత వాటర్ ట్యాంకర్ డ్రైవర్ పారిపోయాడు. అతనిపై కేసు పెట్టారు. డ్రైవర్ కోసం వెతుకుతున్నాం అని పోలీసులు చెప్పారు.



