← Back to news

ప్రియాంక చోప్రా షాకింగ్ కామెంట్స్- డ్యాన్స్ రాదని తిట్టారు!

By sahani· 30 Apr 2026· Eenadu
ప్రియాంక చోప్రా షాకింగ్ కామెంట్స్- డ్యాన్స్ రాదని తిట్టారు!

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన కెరీర్ స్టార్టింగ్‌లో జరిగిన ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకున్నారు. సౌత్ ఆఫ్రికాలో షూటింగ్ జరుగుతున్నప్పుడు కొరియోగ్రాఫర్ రాజు ఖాన్ ఆమెపై అందరిముందే అరిచారట. అందంగా ఉంటే సరిపోదు.. డ్యాన్స్ కూడా నేర్చుకో అని మైక్ విసిరేసి వెళ్ళిపోయారట. దీంతో పట్టుదలతో కత్రినా కైఫ్‌తో కలిసి రోజుకు 6 గంటలు ప్రాక్టీస్ చేశానని ప్రియాంక చెప్పారు. ప్రస్తుతం ఆమె రాజమౌళి - మహేష్ బాబు సినిమా ‘వారణాసి’లో నటిస్తున్నారు. ఈ మూవీలో తనకు ఒక మంచి డ్యాన్స్ సాంగ్ కావాలని రాజమౌళిని రిక్వెస్ట్ చేసినట్లు ఆమె తెలిపారు.

More in Entertainment