← Back to news

గోల్డ్ మెడల్.. రంగారెడ్డి బాక్సర్ భవ్యతేజిని!

By Shirisha· 2d ago
గోల్డ్ మెడల్.. రంగారెడ్డి బాక్సర్ భవ్యతేజిని!

రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలానికి చెందిన ఓ పేద విద్యార్థిని సంచలనం సృష్టించింది. ఆమె పేరు జిల్లెళ్ళ భవ్యతేజిని. నార్సింగి గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు జంగయ్య, పరిమళ రాణి. ఈ చిన్నారి బాక్సింగ్ రింగ్‌లో సత్తా చాటుతోంది. హైదరాబాద్ షేక్‌పేట్ స్టేడియంలో డిస్ట్రిక్ట్ లెవల్ అండర్-17 బాక్సింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ నెగ్గింది. ఇప్పటివరకు ఆమె 4 గోల్డ్, 2 సిల్వర్ మెడల్స్ సాధించింది. పేదరికాన్ని జయించి.. ఇలా మెరవడం అద్భుతం కదూ! ఆమె ఇంకా ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.

గోల్డ్ మెడల్.. రంగారెడ్డి బాక్సర్ భవ్యతేజిని!

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 4h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.