← Back to news

కేరళ చర్చీలో రెండు వర్గాల ఘర్షణ

By విశీ· 10 Aug 2026· X· Kerala

కేరళలోని ఎర్నాకులం జిల్లా మువట్టుపుళా సమీపంలోని పిరమడం సెయింట్ జాన్స్ బెత్లెహెమ్ చర్చిలో మలంకర ఆర్థడాక్స్ సిరియన్ చర్చి, జాకబైట్ సిరియన్ క్రిస్టియన్ చర్చి సభ్యుల మధ్య ఘర్షణ జరిగింది. కోర్టు ఆదేశం ప్రకారం ఆర్థడాక్స్ సభ్యులు ప్రేయర్ చేసేందుకు చర్చిలోకి రాగా, జాకబైట్ కంట్రోల్లో ఉన్న చర్చి సభ్యులు వ్యతిరేకించారు. రెండు వర్గాలు వేర్వేరు కోర్టు ఆదేశాలను చూపించి వాగ్వాదానికి దిగాయి. పోలీసులు వచ్చి చర్చిని మూసేశారు.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 11h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.