← Back to news

సద్దుల బతుకమ్మకు భారీ పోలీసు బందోబస్తు

By kesharaju sai kumar· 1d ago· Warangal
సద్దుల బతుకమ్మకు భారీ పోలీసు బందోబస్తు

వరంగల్‌లో సద్దుల బతుకమ్మ వేడుకల నేపథ్యంలో ఉర్సు రంగలీలా మైదానంలో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. వేడుకలకు భారీగా మహిళలు, భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఇద్దరు డీసీపీలు, సీఐలు, ఎస్సైలు బందోబస్తును పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, జనసందోహం నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందికి సూచించారు. వేడుకలు ప్రశాంతంగా జరిగేలా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

More in Local