నేటి నుంచి మార్కెట్ బంద్..!

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెటు నేటి నుంచి 21 వరకు ఐదు రోజుల పాటు సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ కమిటీ ఛైర్మన్ ప్రియాంక తెలిపారు. నేడు యార్డు బంద్, ఆదివారం వారాంతపు సెలవు, 19న మహర్నవమి, 20న విజయదశమి, 21న మరుసటి రోజు సెలవు ఉంటాయని పేర్కొన్నారు. అక్టోబర్ 22న గురువారం మార్కెట్ తిరిగి ప్రారంభమవుతుందని ఛైర్మన్ ప్రియాంక తెలిపారు.



