నాలుగు మున్సిపాలిటీల్లో 144 సెక్షన్

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చిత్తూరు, పలమనేరు, నగరి, కుప్పం మున్సిపాలిటీల నామినేషన్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించినట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం అక్టోబర్ 16 రాత్రి 11 గంటల నుంచి అక్టోబర్ 18 సాయంత్రం 5 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించారు. నామినేషన్ కేంద్రాల సమీపంలో అనుమతి లేకుండా ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడడం, ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించడం నిషేధమని స్పష్టం చేశారు.


