రజినీకాంత్ సినిమాలో రామ్.. క్రేజీ ప్రాజెక్ట్‌లో ఛాన్స్!

టాలీవుడ్ హీరో రామ్ పోతినేని మరో క్రేజీ ప్రాజెక్ట్‌లోకి అడుగుపెట్టారు. సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘ధర్మన్’ సినిమాలో 'కీ' రోల్ చేస్తున్నాడు. అశ్వత్ మారిముత్తు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో రజినీకాంత్‌తో రామ్ తలపడనున్నట్లు తెలుస్తోంది. 2022లో ‘ది వారియర్’తో తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్‌కు ఇది సెకండ్ తమిళ్ సినిమా. ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడంపై రామ్ ఉత్సాహంగా ఉన్నట్లు మూవీ టీమ్ తెలిపింది. ఈ మూవీని కమల్ హాసన్ నిర్మిస్తుండగా, సిమ్రాన్, రాశీ ఖన్నా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.



