← Back to news

ట్యాంక్‌బండ్‌పై కొనసాగుతున్న బతుకమ్మ సందడి

By Nani Eluri· 1d ago· Dishadaily
ట్యాంక్‌బండ్‌పై కొనసాగుతున్న బతుకమ్మ సందడి

TG: హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ వేడుకలు కొనసాగుతున్నాయి. అమరవీరుల స్మారకం నుంచి ట్యాంక్‌బండ్ వరకు మహా బతుకమ్మ ర్యాలీ నిర్వహిస్తున్నారు. 600 మందికి పైగా మహిళలు బతుకమ్మలతో, సుమారు 700 మంది కళాకారులు జానపద ప్రదర్శనలతో పాల్గొంటున్నారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా, పలువురు మంత్రులతో పాటు విజయ్ దేవరకొండ, రష్మిక హాజరయ్యారు. హుస్సేన్‌సాగర్ దగ్గర ఫైర్‌వర్క్స్, లేజర్ షో ఏర్పాటు చేశారు. నగరంలోని పలు ప్రాంతాలు రంగురంగుల లైట్లతో మెరిసిపోతున్నాయి.

ట్యాంక్‌బండ్‌పై కొనసాగుతున్న బతుకమ్మ సందడి
ట్యాంక్‌బండ్‌పై కొనసాగుతున్న బతుకమ్మ సందడి

More in TG