అల్లీపూర్‌లో ఉచిత నేత్ర వైద్య శిబిరం

TG: జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలోని మున్నూరు కాపు సంఘ భవనంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి, కంటి వ్యాధులపై అవగాహన కల్పించారు. అవసరమైన వారికి కరీంనగర్‌లోని రేకుర్తి కంటి ఆసుపత్రిలో ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయిస్తామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ కన్వీనర్ తంగెళ్ల రమేష్, అధ్యక్షులు వాసం ప్రసాద్, సెక్రటరీ కనపర్తి శ్రీనివాస్, ట్రెజరర్ సుధావేణి మురళి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.




