← Back to news

పాకాలలో అరుదైన చేపల డేగ దర్శనం

By A VIJAY KUMAR· 26 Aug 2026· Warangal
పాకాలలో అరుదైన చేపల డేగ దర్శనం

వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం పాకాల బయోడైవర్సిటీ పార్కులో అరుదైన గ్రే హెడ్డెడ్ ఫిష్ ఈగిల్ (చేపల డేగ) సందడి చేసింది. బూడిదరంగు తల, మెడ, ముదురు గోధుమరంగు రెక్కలు, తెల్లటి దిగువ భాగంతో కనిపించిన ఈ అరుదైన పక్షి సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. సాధారణంగా నీటి వనరుల పరిసర ప్రాంతాల్లో సంచరించే ఈగిల్ పాకాల అటవీ ప్రాంతంలో దర్శనమివ్వడం ఇక్కడి జీవ వైవిధ్యానికి నిదర్శనమని ఎఫ్‌ఎస్‌ఓ ధర్మ తెలిపారు. ఎకో టూరిజం వాచర్ జయప్రకాష్ ఈ పక్షిని తన కెమెరాలో అందంగా బంధించారు.

More in Local