‘ఇరుముడి’పై ఏపీ టీచర్ల ఆగ్రహం

‘ఇరుముడి’ మూవీలో గవర్నమెంట్ టీచర్లను నెగిటివ్ గా చూపించడాన్ని ఏపీ టీచర్స్ ఫెడరేషన్ తప్పుబట్టింది. పైగా మూవీలో స్కూల్ పిల్లల యూనిఫాం కూడా ఏపీ ప్రభుత్వ స్కూళ్ల యూనిఫాంలానే ఉండటంతో ఏపీ స్కూళ్లు, ఏపీ టీచర్లపైన ప్రజల్లో తప్పుడు అభిప్రాయం ఏర్పడుతుందని, క్రియేటివిటీ పేరుతో మొత్తం ఉపాధ్యాయ సమాజాన్ని కించపరచడం సరికాదని ఆవేదన వ్యక్తం చేసింది. రవితేజ లీడ్ రోల్లో నటించిన 'ఇరుముడి' హిట్ టాక్ తెచ్చుకుంది.



