ఏంటీ కులవివక్ష? మీరు మారరా?
కడప జిల్లా.. కమలాపురం మండలం.. ఎర్రగుడిపాడు గ్రామంలో కులవివక్ష ఆరోపణలు తీవ్ర చర్చగా మారాయి. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం బయట దండం పెట్టుకుంటుండగా.. గ్రామ మాజీ సర్పంచ్ ఏనుగు బ్రహ్మానందరెడ్డి తనను అడ్డుకుని.. ఆలయం బయట కూడా దండం పెట్టకూడదని బెదిరించారనీ, అలాగే కులం పేరుతో దూషించారని రిపోర్టర్ కురుగాండ్ల చంద్ర ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి, కులవివక్షకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

