← Back to news

గద్దర్‌పై డాక్యుమెంటరీ.. పోస్టర్ రిలీజ్!

By sahani· 18 Aug 2026· X· Telangana
గద్దర్‌పై డాక్యుమెంటరీ.. పోస్టర్ రిలీజ్!

ప్రజా యుద్ధ నౌక గద్దర్ డాక్యుమెంటరీ పోస్టర్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విడుదల చేశారు. ప్రజా ఉద్యమాలకు గద్దర్ చిరునామాగా నిలిచారని, తన ఆటపాటలతో పీడిత ప్రజల గొంతుకగా కోట్ల మందిని ఉద్యమాల వైపు నడిపించారని కొనియాడారు. గద్దర్‌పై తనకు, సీఎం రేవంత్‌రెడ్డికి ప్రత్యేక అభిమానం ఉందన్నారు. గద్దర్ కుమార్తె వెన్నెల రూపొందిస్తున్న డాక్యుమెంటరీ ద్వారా ఆయన ఉద్యమ ప్రస్థానం, పోరాట స్ఫూర్తిని భావితరాలకు చేరవేయడం అభినందనీయమన్నారు. ఈ ప్రయత్నానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.

గద్దర్‌పై డాక్యుమెంటరీ.. పోస్టర్ రిలీజ్!
గద్దర్‌పై డాక్యుమెంటరీ.. పోస్టర్ రిలీజ్!

More in Current Affairs