← Back to news

రాజధాని కోసం భూములిచ్చాం.. న్యాయం చేయండి

By KUCHIPUDI BUJJIBABU· 2 Oct 2026· Salivahanapeta, Mangalagiri, Guntur

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో తన ప్లాట్‌కు సంబంధించిన సమస్యపై లంక సుధాకరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాట్ నంబర్ 12-516-2423-3-E-43కు సంబంధించి తలెత్తిన సమస్యను వివరిస్తూ ఆయన వీడియో విడుదల చేశారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిశీలించి, వాస్తవాలను తెలుసుకుని తగిన పరిష్కారం చూపాలని సుధాకరరావు కోరారు. పదేళ్ల కింద అమరావతి రాజధాని కోసం భూమిలిచ్చామని, తనకు న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

More in AP