← Back to news

ప్రియురాలికి iPhone కొనివ్వాలని.. గంజాయి మార్గం

By E.Nani· 3h ago
ప్రియురాలికి iPhone కొనివ్వాలని.. గంజాయి మార్గం

TG: ఖమ్మ జిల్లాకు చెందిన 21 ఏళ్ల మిత్ర చైతన్య తన ప్రియురాలికి iPhone కొనివ్వాలని అనుకున్నాడు. దానికి డబ్బు కావాలి. అందుకోసం ఒడిశాలోని పసుపులంక నుంచి హైదరాబాద్‌కు గంజాయిని తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. పక్కా సమాచారంతో వైరా పోలీసులు తనిఖీలు చేసి అతణ్ని పట్టుకున్నారు. 12 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో మరికొందరి పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.