← Back to news

రెండేళ్లు గడిచినా తమ సమస్యలు పరిష్కరించలేదు

By DK· 30 Jun 2026· తూర్పుగోదావరి జిల్లా
రెండేళ్లు గడిచినా తమ సమస్యలు పరిష్కరించలేదు

AP: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఇప్పటివరకు తమ సమస్యలు పరిష్కరించలేదని AP రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరిని కలిసి ఉద్యోగుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. చంద్రబాబు ప్రభుత్వం వస్తే బకాయిలు చెల్లిస్తారని ఉద్యోగులంతా ఆశించారని కానీ, ప్రభుత్వం ఏ ఉద్యోగికి ఎంత బకాయి ఇవ్వాలో చెప్పాలని కోరినా కనీస స్పందనలేదని ఫైరయ్యారు. ఆరు నెలలకోసారి పెరగాల్సిన DAను రెండేళ్లుగా ప్రభుత్వం ప్రకటించలేదన్నారు. అలాగే, PRC కమిషన్‌ను ఇప్పటివరకు నియమించలేదన్నారు.

More in AP