హార్ట్‌ఎటాక్‌తో ఆళ్ల నాని కన్నుమూత

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్లనాని గుండెపోటుతో మరణించారు. ఏలూరు నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. వైసీపీ హయాంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా, డిప్యూటీ సీఎంగా సేవలు అందించారు. 57 ఏళ్ల ఆళ్ల నాని అసలు పేరు ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్. 1969 డిసెంబర్ 30న ఏలూరులో జన్మించిన ఆయన.. 2004, 2009లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో YCP నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల తర్వాత ఆయన TDPలో చేరినా.. పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా లేరు. ఆయన మృతితో అభిమానులు విషాదంలో మునిగిపోయారు.


