మంగంపేట బైరైటీస్ కొల్లగొడుతున్నారని నిజనిర్ధారణ కమిటీ ఆందోళన
తిరుపతి జిల్లా రైల్వే కోడూరు సమీపంలోని మంగంపేట బైరైటీస్ గనుల మూసివేతపై నిజనిర్ధారణ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. అరుదైన ఖనిజ సంపదను భారీగా విదేశాలకు తరలిస్తూ జాతీయ ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని కమిటీ అభిప్రాయపడింది. గనుల పరిస్థితి, టెండర్లు, ఎగుమతులు, మైన్ క్లోజర్ ప్రతిపాదనలపై అధ్యయనం కోసం విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. మాజీ మంత్రి, విశ్రాంత ఐపీఎస్, ఐఏఎస్ అధికారులతో కూడిన ఈ కమిటీ ఏర్పాటైందని పోరాట కమిటీ కన్వీనర్ కందారపు మురళి తెలిపారు.




