మాజీ కాంగ్రెస్ ఎంపీ సజ్జన్‌కుమార్ కన్నుమూత

1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో దోషిగా తేలి జీవిత ఖైదు అనుభవిస్తున్న మాజీ కాంగ్రెస్ ఎంపీ సజ్జన్‌కుమార్ (80) మరణించారు. తిహార్ జైలులో ఉన్న ఆయన హెల్త్ పాడవడంతో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య తర్వాత 1984 నవంబర్ 1, 2వ తేదీల్లో జరిగిన అల్లర్లలో ఐదుగురి మృతికి ఆయన కారణమైనట్లు కోర్టు తేల్చింది. దిల్లీ హైకోర్టు 2018 డిసెంబర్ 17న సజ్జన్‌కుమార్‌కు జీవిత ఖైదు విధించింది.



