← Back to news

ACBకి పట్టుబడ్డ రాజంపేట ఎస్సై

By K. RAJASHEKAR KMR· 21 Aug 2026· Rajampet, Rajampet, Kamareddy
ACBకి పట్టుబడ్డ రాజంపేట ఎస్సై

TG: కేసులో అనుకూలంగా వ్యవహరించేందుకు లంచం తీసుకుంటున్నారనే ఆరోపణలపై కామారెడ్డి జిల్లాలో ఓ ఎస్సై ఏసీబీకి పట్టుబడ్డారు. రాజంపేట పోలీస్ స్టేషన్ ఎస్సై ఆంజనేయులు రూ.30 వేల లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం. ఓ కేసులో అనుకూలంగా వ్యవహరించేందుకు లంచం డిమాండ్ చేశారని బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా అధికారులు పక్కా ప్రణాళికతో దాడి నిర్వహించి ఎస్సైను అదుపులోకి తీసుకున్నారు.

ACBకి పట్టుబడ్డ రాజంపేట ఎస్సై

More in Local