← Back to news

ముత్తోజిపేటలో ఘనంగా దసరా వేడుకలు

By Ramesh Ch· 1h ago· Narsampet, Warangal

వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ముత్తోజిపేటలో గ్రామస్థులు దసరా వేడుకలను సంప్రదాయం ప్రకారం ఘనంగా జరుపుకున్నారు. ముందుగా బొడ్రాయికి కంకణం కట్టి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ ప్రజలందరూ కంకణాలు కట్టుకొని ఆచారాన్ని పాటించారు. తర్వాత ఆనిక్కాయ కొట్టి వేడుకలను కొనసాగించారు. గ్రామస్థులంతా జమ్మి చెట్టు వద్దకు వెళ్లి సంప్రదాయబద్ధంగా జమ్మి ఆకులు తెంపి పంచుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ పెద్దలు పాల్గొని ఆచారాలను కొనసాగించారు.

More in Local