ఈత చెట్టు నుంచి పడి గీత కార్మికుడికి గాయాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్ గ్రామంలో గీత కార్మికుడు నేరెళ్ల శ్రీనివాస్ ఈత చెట్టు పైనుంచి జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. మంగళవారం ఉదయం కల్లు సేకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తోటి కార్మికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాస్‌కు భార్య సరోజ, కుమారుడు సాయి, కూతురు సంధ్య ఉన్నారు. శ్రీనివాస్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని అల్మాస్‌పూర్ గౌడ సంఘం అధ్యక్షుడు కందునూరి శ్రీనివాస్ గౌడ్ కోరారు.


