← Back to news

రిజర్వేషన్లు, భూ సమస్యలపై కమిషన్ కీలక సమీక్ష

By sravan ubbapelly· 21 Aug 2026
రిజర్వేషన్లు, భూ సమస్యలపై కమిషన్ కీలక సమీక్ష

TG: ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల నియామకాలు, పదోన్నతులు, రిజర్వేషన్లు, భూసమస్యలపై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధ్యక్షతన సభ్యులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ శబరిష్, అదనపు కలెక్టర్ రెవెన్యూ కె.అనిల్‌కుమార్‌తో పాటు వివిధ శాఖల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసుల పరిష్కారం, బాధితులకు నష్టపరిహారం, భూ సమస్యలు, సబ్‌ప్లాన్ నిధుల వినియోగం తదితర అంశాలపై అధికారులు వివరాలు అందించారు.

More in Local