← Back to news

క్వాలిటీ చెక్‌లో జీడిపప్పు ఫెయిల్‌.. 12 టన్నులు వెనక్కి!

By Anusha· 4 Oct 2026
క్వాలిటీ చెక్‌లో జీడిపప్పు ఫెయిల్‌.. 12 టన్నులు వెనక్కి!

AP: తిరుమల శ్రీవారి ప్రసాదాల కోసం పార్వతీపురం మన్యం నుంచి పంపిన 12 టన్నుల జీడిపప్పును టీటీడీ అధికారులు తిరస్కరించారు. తిరుమల ల్యాబ్‌లో శాంపిల్స్‌ పరీక్షించగా, క్వాలిటీ ప్రమాణాలకు సరిపోలేదని తేలింది. దీంతో మొత్తం సరుకును వెనక్కి పంపారు. రైతుల నుంచి నేరుగా కొనాల్సిన జీడిపప్పును వ్యాపారుల నుంచి సేకరించి పంపినట్లు తెలుస్తోంది. పంపే ముందు నాణ్యత పరీక్షలు చేశారా? అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.

More in AP