← Back to news

స్వచ్ఛ భారత్ లక్ష్యం నీరుగారుతోంది

By Kamal Kumar· 1d ago
స్వచ్ఛ భారత్ లక్ష్యం నీరుగారుతోంది

TG: వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ఎక్మాయి గ్రామంలో స్వచ్ఛ భారత్ మిషన్‌ గ్రామీణ లక్ష్యం నీరుగారుతోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో చెత్త సేకరణ కోసం ఏర్పాటు చేసిన వాహనాన్ని సక్రమంగా వినియోగించకపోవడంతో పారిశుద్ధ్య సమస్యలు నెలకొంటున్నాయని తెలిపారు. చెత్తను క్రమం తప్పకుండా సేకరించి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన వాహనం నిరుపయోగంగా ఉండటంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి చెత్త సేకరణ వాహనాన్ని వినియోగంలోకి తీసుకురావాలని కోరారు.

స్వచ్ఛ భారత్ లక్ష్యం నీరుగారుతోంది

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 4h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.