ఓటరు జాబితాలపై 27న గ్రామ సభలు, వార్డు సభలు

TG: ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఈ నెల 27న జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో గ్రామసభలు, వార్డుసభలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు. ఓటరు జాబితాల్లో పేర్లు, వివరాలను పరిశీలించుకుని అవసరమైన సవరణలు చేసుకోవాలని సూచించారు. అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండే యువత తప్పనిసరిగా ఫారం-6 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. ఇప్పటికే నమోదైన ఓటర్ల వివరాల్లో మార్పులు, సవరణలు అవసరమైతే ఫారం-8ను వినియోగించుకోవచ్చన్నారు.


