ఫోటోతో ట్రోలర్స్ కు ఎన్టీఆర్ చెక్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కండలు తిరిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ కోసం ఆయన తన బాడీని ఇలా బిల్డ్ చేశారు. ఎన్టీఆర్ లుక్స్ పై గతంలో సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వచ్చాయి. మూవీ షెడ్యూల్ వాయిదా పడిందన్న ప్రచారం జరిగింది. ఈ ఒక్క ఫోటోతో ఎన్టీఆర్ ఆ ప్రచారాన్ని తిప్పికొట్టారు. The quieter it gets… the louder it’s about to be అని క్యాప్షన్ ఇచ్చారు. ఎంత నిశ్శబ్దంగా ఉంటే అంత శబ్దం గట్టిగా వస్తుందని అన్నారు. ఈ కండలు కష్టపడి తెచ్చుకున్నవే కానీ కొనుక్కున్నవి కాదని తన పోస్టులో రాసుకొచ్చారు.



