వెల్గటూర్‌లో SGF క్రీడా పోటీలు

TG: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో క్రీడా పోటీలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 10, 11, 15 తేదీల్లో పోటీలు నిర్వహించనున్నట్లు మండల విద్యాధికారి బి. ప్రభాకర్, మండల కన్వీనర్ పి. రాజ్‌కుమార్ తెలిపారు. 10న అండర్-14, అండర్-17 బాలికలకు కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్ పోటీలు, 11న బాలురకు ఇదే క్రీడల్లో పోటీలు నిర్వహిస్తారు. 15న బాల, బాలికలకు అథ్లెటిక్స్ పోటీలు జరగనున్నాయి. కార్యక్రమంలో మండల పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు.



