ChatGPT సాయంతో చదువు.. సివిల్స్‌లో 5వ ర్యాంకు!

హరియాణాలోని హిసార్‌కు చెందిన 23 ఏళ్ల ఛావి సర్దానా 'హర్యానా సివిల్ సర్వీసెస్' పరీక్షలో ఐదో ర్యాంకు సాధించింది. 675 మార్కులకు 385.80 మార్కులు తెచ్చుకుంది. రోజుకు 8 గంటలు చదువుతూ, సోషల్ మీడియాకు దూరంగా ఉన్నానని, చదువులో సందేహాలు వచ్చినప్పుడు ChatGPT సాయంతో సమాధానాలు తెలుసుకున్నానని ఆమె వివరించింది. చదువుతోపాటు సరైన ప్రణాళిక, క్రమం తప్పకుండా సాధన చేస్తూ ఈ విజయాన్ని అందుకుందన్నానంది.



