← Back to news

సింగపూర్‌లో బిడ్డ పుడితే.. దాదాపు ₹50 లక్షల సపోర్ట్‌!

By Nani Garikina· 5 Sept 2026· Channelnewsasia
సింగపూర్‌లో బిడ్డ పుడితే.. దాదాపు ₹50 లక్షల సపోర్ట్‌!

బిడ్డ పుడితే ప్రభుత్వం నుంచి దాదాపు ₹50 లక్షల సపోర్ట్‌! కొత్త SG Child Support Packageలో ప్రతి సింగపూర్‌ సిటిజన్‌ బిడ్డకు 17 ఏళ్లు వచ్చేలోపు S$70,000 వరకు సాయం అందుతుంది. ఇందులో S$10,000 క్యాష్‌ గిఫ్ట్‌, MediSave, Child Credits, ఎడ్యుకేషన్‌ సపోర్ట్‌ ఉన్నాయి. ఈ ప్యాకేజీ 2027 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానుంది. జననాల రేటు తగ్గుతున్న నేపథ్యంలో పిల్లల పెంపకం ఖర్చును తగ్గించి, కుటుంబాలను ప్రోత్సహించడమే లక్ష్యం. అయితే ఈ మొత్తం ఒకేసారి చేతికి వచ్చే డబ్బు కాదు.. క్రమంగా అందుతుంది.

More in International