మాలీలకు ఎస్టీ హోదా కల్పించాలి

TG: కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా మాలీ కులస్థులకు ఎస్టీ హోదా కల్పించే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లెండుగురే శ్యామ్‌రావు డిమాండ్ చేశారు. ఎస్టీ హోదా సాధించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు. గత ఎన్నికల్లో బీజేపీ నాయకులు మాలీలకు ఎస్టీ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చినా, ఎన్నికల అనంతరం పార్లమెంట్‌లో గానీ అసెంబ్లీలో గానీ ఈ అంశాన్ని ప్రస్తావించడం లేదని విమర్శించారు.



