← Back to news

11 నుంచి అమ్మవారి దసరా ఉత్సవాలు షురూ

By GOLLAPALLI SUDHAKAR RAO· 1h ago· Duttalur, Duttalur, Sri Potti Sriramulu Nellore
11 నుంచి అమ్మవారి దసరా ఉత్సవాలు షురూ

పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం తూర్పు రొంపిదొడ్లలోని శ్రీ మానసాదేవి (నాగలక్ష్మీ అమ్మవారి) దేవస్థానంలో ఈ నెల 11నుంచి 20వ తేదీ వరకు దసరా మహోత్సవాలు నిర్వహించనున్నారు. పది రోజులపాటు అమ్మవారికి వివిధ దివ్య అలంకారాలు, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. విజయదశమి రోజున శమీ వృక్ష పూజ, పవళింపు సేవ, నైవేద్యాలు, హారతులు నిర్వహించడంతో పాటు భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేయనున్నట్లు దేవస్థాన కమిటీ సభ్యులు తెలిపారు.

11 నుంచి అమ్మవారి దసరా ఉత్సవాలు షురూ

More in Local