'ప్రజల్లో నమ్మకం పెంచేలా విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలి'

TG: ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెంచేలా విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలని జిల్లా ఎస్పీ ఆకాంక్ష్ యాదవ్ సూచించారు. శుక్రవారం యాదాద్రిభువనగిరి జిల్లా వలిగొండ పోలీస్‌స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పనితీరు, సిబ్బంది క్రమశిక్షణ, అత్యవసర సమయాల్లో స్పందించే విధానాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. స్టేషన్‌లోని రిసెప్షన్ కౌంటర్, క్రైమ్ విభాగం, జనరల్ డైరీ నిర్వహణను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులకు తక్షణమే సహాయం అందించాలని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో లేదా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.


