← Back to news

మోనాలిసా భర్తపై పోక్సో కేసు నమోదు!

By sahani· 10 Apr 2026· Telugu Report· Madhya pradesh
 మోనాలిసా భర్తపై పోక్సో కేసు నమోదు!

కుంభమేళా ఫేమ్ మోనాలిసా భర్త ఫర్మాన్ ఖాన్‌పై మధ్యప్రదేశ్ పోలీసులు పోక్సో కేసు ఫైల్ చేశారు. 16 ఏళ్ల మైనర్‌ను పెళ్లి చేసుకున్నారనే ఆరోపణలతో అతనిమీద కేసు ఫైల్ అయింది. పెళ్లి చేసుకునే సమయానికి ఆమె వయసు 16 సంవత్సరాలు మాత్రమే. అంతేకాదు పెళ్లి కోసం దంపతులు ఫేక్ బర్త్ సర్టిఫికేట్ తయారు చేయించారని విచారణలో తేలింది. ఆలయ పెద్దలు మాత్రం దంపతులు ఇచ్చిన గుర్తింపు కార్డుల ఆధారంగానే వివాహం చేశామని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

More in Entertainment