← Back to news

భార్య ఆత్మహత్య కేసులో భర్తకు 5 ఏళ్ల జైలు

By Anguli Malaji· 58m ago· Mortad, Morthad, Nizamabad
భార్య ఆత్మహత్య కేసులో భర్తకు 5 ఏళ్ల జైలు

నిజామాబాద్‌లో వరకట్న వేధింపుల కేసులో భర్తకు సెషన్స్‌ కోర్టు ఐదేళ్ల కఠిన జైలు శిక్ష విధించింది. ఇందల్వాయి మండలం చంద్రాయన్‌పల్లికి చెందిన వేముల సాయిలుకు 2016లో మనోజతో వివాహమైంది. అదనపు కట్నం కోసం భార్యను వేధించడంతో ఆమె 2024 అక్టోబర్‌లో ఆత్మహత్య చేసుకుంది. విచారణలో నేరం రుజువు కావడంతో జడ్జి జీవీఎన్‌ భారతలక్ష్మి శిక్ష విధించారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులను CP సాయి చైతన్య అభినందించారు.

More in Local