కాకరవాయి రైతులకు సాగునీటి కష్టాలు

తిరుమలాయపాలెం మండలం కాకరవాయిలో వర్షాలు ఆశించిన స్థాయిలో లేక చెరువులు, కుంటల్లో నీరు తగ్గిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ కోతలు, లో-వోల్టేజీ కారణంగా మోటార్లు సక్రమంగా పనిచేయడం లేదని తెలిపారు. పంటలకు కీలక దశలో సాగునీరు అందకపోతే నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. భక్త రామదాసు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చెరువులకు నీటిని మళ్లించి నింపాలని రైతులు ప్రభుత్వాన్ని కోరారు.



