బిహార్‌లో స్టూడెంట్స్ ఎందుకు రోడ్డెక్కారు?

ప్రభుత్వ ఉద్యోగం కోసం చదివిన స్టూడెంట్స్.. ఇప్పుడు అదే పరీక్షను రద్దు చేయాలంటూ రోడ్డెక్కారు! 👀 బిహార్‌లో 70వ BPSC పరీక్షలో అవకతవకలు, పేపర్ లీక్ ఆరోపణలు ఉన్నాయని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు టీచర్ రిక్రూట్‌మెంట్ పరీక్షలో ఒకే దశలో పరీక్ష పెట్టాలని, నెగెటివ్ మార్కింగ్ తీసేయాలని కూడా కోరుతున్నారు. ఇవే డిమాండ్లతో పాట్నాలో సీఎం నివాసం వైపు మార్చ్ చేయగా.. పోలీసులు వాటర్ కేనన్లు, లాఠీలతో అడ్డుకున్నారు.



