రాజోలి–కర్నూలు రూట్‌లో APSRTC బస్సు

జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి–సుంకేసుల డ్యాం మీదుగా కర్నూలుకు APSRTC బస్సు సర్వీసు సోమవారం ప్రారంభమైంది. ఈ కొత్త బస్సు సర్వీస్‌ను సర్పంచ్ గంగిరెడ్డి, వైస్ సర్పంచ్ సంధ్యారెడ్డి ప్రారంభించారు. కర్నూలు నుంచి రాజోలికి ఉదయం 5:30, 9:30, మధ్యాహ్నం 12:00 గంటలకు.. రాజోలి నుంచి కర్నూలుకు ఉదయం 6:45, 10:45, మధ్యాహ్నం 1:15 గంటలకు బస్సులు ఉంటాయని చిన్నరాజు తెలిపారు. ఈ సర్వీసులు డైలీ అవైలబుల్‌గా ఉంటాయని చెప్పారు.



