← Back to news

ఎల్‌నినో ఎఫెక్ట్.. ముందస్తు చర్యలకు CM సూచనలు

By dk· 4 Aug 2026· అమరావతి
ఎల్‌నినో ఎఫెక్ట్.. ముందస్తు చర్యలకు CM సూచనలు

AP: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో ఎల్‌నినో ప్రభావం, రిజర్వాయర్లలో నీటి లభ్యతను నిరంతరం అంచనా వేయాలని సూచించారు. కృష్ణా బేసిన్‌కు వచ్చే వరద నీటిని సద్వినియోగం చేసుకోవాలని, పశుగ్రాసం కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి నాణ్యతను తరచూ పరీక్షించాలని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు.

More in AP