← Back to news

జనగాంలో సీపీఎం నేతల ముందస్తు అరెస్టులు

By DK· 1h ago
జనగాంలో సీపీఎం నేతల ముందస్తు అరెస్టులు

TG: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల డ్రా కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పిలుపునిచ్చిన సీపీఎం, CITU నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. జనగాం జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆధ్వర్యంలో డ్రా నిర్వహించనున్న నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన నాయకులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తమ నాయకులను అరెస్టు చేయడాన్ని సీపీఎం నేతలు తీవ్రంగా ఖండించారు. డ్రా కార్యక్రమానికి వ్యతిరేకంగా నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో అరెస్ట్ చేశారు.

More in Local