స్వీట్ Shopsపై రైడ్స్.. కస్టమర్స్‌కు పోలీసుల అలర్ట్!
TG: హైదరాబాద్ పోచారం IT కారిడార్‌లో స్వీట్ షాప్స్‌పై పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. చౌదరిగూడలోని ఓ స్వీట్ షాపులో ఉప్పల్ పోలీసులు, SOT టీమ్ రైడ్ చేశారు. స్వీట్ల తయారీలో ఆరోగ్యానికి హాని చేసే సింథటిక్ కలర్స్ వాడుతున్నట్లు గుర్తించారు. దీంతో రాజస్థాన్‌కు చెందిన షాప్ ఓనర్ కమల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు బుక్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. కస్టమర్స్ స్వీట్స్ కొనేముందు తయారీ, Expiry డేట్ చెక్ చేయాలని, స్మెల్, టేస్ట్‌తో పాటు స్వీట్ క్వాలిటీని కూడా ఒకసారి చెక్ చేయాలని సూచించారు.



