పల్లెల్లో పుట్టగొడుగుల్లా బెల్ట్ షాపులు

AP: గ్రామాల్లో అక్రమ బెల్ట్ షాపులు పెరిగి పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామాల ప్రజలు అంటున్నారు. తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు మద్యం అందుబాటులో ఉండటంతో యువత, కూలీలు, పేదలు మద్యానికి బానిసవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్యం మత్తులో గొడవలు పెరగడంతో మహిళలు, విద్యార్థులు రోడ్లపై వెళ్లేందుకు భయపడుతున్నారు. పోలీసు, ఆబ్కారీ శాఖ అధికారులు అక్రమ దుకాణాలను సీజ్ చేసి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని అంటున్నారు.



