వారెవ్వా.. ఇరాన్.. వాట్ ఏ ప్లాన్?

హర్మూజ్ ను బ్లాక్ చేసినా ఇరాన్ దాని ప్లాన్స్ లో అది ఉంది. అప్పటికే తన దగ్గరున్న చమురును సేఫ్ ప్లేస్ కి తరలించేంది. యుద్ధం ప్రారంభం కాకముందే రోజూ కంటే మూడు రెట్లు వేగంగా ట్యాంకర్లలో చమురును ఫిల్ చేసేసింది. మార్చి చివరి నాటికే దాదాపు 174 మిలియన్ బారెళ్ల చమురును సముద్రంలో ఫ్లోటింగ్ స్టోరేజ్ రూపంలో స్టోర్ చేసింది. ఇందులో 158 మిలియన్ బారెళ్ల ముడి చమురు, మిగిలినదంతా పెట్రోలియం ప్రోడక్ట్స్. ఇరాన్ ను బ్లాక్ చేసినా ఈ చమురును ఎవరూ తాకలేరు. ఇవిమలేషియా తీరంలో జోహార్ దగ్గర ట్రాకింగ్ సిగ్నల్స్ ఆపేసి ఎవరికీ కనిపించకుండా చీకట్లో నడుస్తున్నాయి. డజన్ల కొద్దీ నౌకలు సీ రూట్ లో చైనాకు వెళుతున్నాయి.
