← Back to news

జడ్చర్లలో ఘనంగా ఈద్ మిలాద్ వేడుకలు

By Mallikarjuna Akula· 26 Aug 2026
జడ్చర్లలో ఘనంగా ఈద్ మిలాద్ వేడుకలు

TG: ముహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో ముస్లిం సోదరులు ఈద్ మిలాద్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేపట్టి, ప్రవక్త మహమ్మద్ బోధించిన శాంతి, సోదరభావం, మానవత్వం, పరస్పర ప్రేమ వంటి సందేశాలను వివరించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ శాంతియుతంగా, ఐకమత్యంతో జీవించాలని మత పెద్దలు పిలుపునిచ్చారు. అనంతరం ముస్లిం సోదరులు ఒకరికొకరు ఈద్ మిలాద్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

జడ్చర్లలో ఘనంగా ఈద్ మిలాద్ వేడుకలు

More in Local