← Back to news

పండగ సాయన్న సమాధి వద్ద నాటక బృందం నివాళులు

By Surender Panuganti· 12h ago· Mahabubnagar
పండగ సాయన్న సమాధి వద్ద నాటక బృందం నివాళులు

తెలంగాణ ప్రజానాయకుడు పండగ సాయన్న పోరాట స్ఫూర్తిని భావితరాలకు పరిచయం చేసేలా రూపొందించిన ‘పండగ సాయన్న’ నాటక పోస్టర్‌ను మంగళవారం మహబూబ్‌నగర్‌లోని ఆయన సమాధి వద్ద ఆవిష్కరించారు. నాటక బృందం నివాళులర్పించింది. ఈ నెల 22న హైదరాబాద్‌ రవీంద్ర భారతిలో జరిగే సాయన్న జయంతి వేడుకల్లో నాటకాన్ని తొలిసారిగా ప్రదర్శించనున్నారు. ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి నేపథ్య వ్యాఖ్యానం అందించనున్నారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

More in Local